నామవరంలో ప్రకృతి వ్యవసాయంపై అవగాహన

78చూసినవారు
నామవరంలో ప్రకృతి వ్యవసాయంపై అవగాహన
పాయకరావుపేట మండలం నామవరం గ్రామంలో ప్రకృతి వ్యవసాయ సిబ్బంది మహిళా సంఘాల సభ్యులకు, రైతులకు ప్రకృతి వ్యవసాయం మీద ఆదివారం అవగాహన కల్పించారు. వరిలో తెల్ల దోమ, పచ్చ దోమ, సుడి దోమ, ఏర్ర నల్లి నుండి పంటను కాపాడుకోవడానికి ఉల్లి కాషాయం తయారీ విధానం ఉపయోగాలను వారికి వివరించారు. అదేవిధంగా పంట దిగుబడి పెరగడం కోసం సప్త ధన్యంకుర ద్రావణం బాగా ఉపయోగపడుందని తయారీ విధానం, ఉపయోగాలను తెలియజేశారు.

సంబంధిత పోస్ట్