సింహాచలం: వైభవంగా నృసింహ దీక్షలు

63చూసినవారు
సింహాచలం సింహాద్రి అప్పన్న ఆలయ ప్రాంగణంలో సోమవారం నృసింహ దీక్షలు వైభవంగా ప్రారంభమయ్యాయి. ఆలయ స్థానాచార్యులు రాజగోపాల్ ఆధ్వర్యంలో పలువురు భక్తులు అత్యంత నియమ నిష్టలతో నృసింహ మాలలు ధరించారు. అనంతరం స్వామివారిని దర్శించుకుని విశేష పూజలు అర్చనలు అభిషేకాలు చేశారు. దీక్షలు స్వీకరించిన భక్తులకు తులసి మాలలు మరియు స్వామివారి ప్రతిమలను ఉచితంగా అందజేశారు.

సంబంధిత పోస్ట్