రైల్వే కోడూరు మండలం కే.బుడుగుంట పల్లి పంచాయతీ సమతా నగర్ లోని గిరిజనులకు ఇచ్చిన సాగు భూమికి పాస్ బుక్కులు ఇచ్చి ఆన్లైన్ చేయాలని కోడూరు మండల డిప్యూటీ తాసిల్దార్ కు సిపిఐ మండల కమిటీ ఆధ్వర్యంలో సోమవారం వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా మండల సిపిఐ కార్యదర్శి దార్ల రాజశేఖర్ మాట్లాడుతూ.. అక్టోబర్ నెల 10వ తేదీ లోపల వారికి న్యాయం చేయకపోతే రెవిన్యూ కార్యాలయం ఎదుట ఆమరణ నిరాహార దీక్ష చేపడతామని హెచ్చరించారు.