అల్లూరి సీతారామరాజు 127వ జయంతి వేడుకలు

73చూసినవారు
అల్లూరి సీతారామరాజు 127వ జయంతి వేడుకలు
రంపచోడవరం మండలంలోని ఎంపీడీవో కార్యాలయం వద్ద అల్లూరి సీతారామరాజు 127 వ జయంతి వేడుకలను ఎంపీపీ బంధం శ్రీదేవి, జడ్పిటిసి పండ వెంకటలక్ష్మి ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ దేశం కోసం ఎన్నో తిరుగుబాటు కార్యక్రమాలు చేసి, దేశం కోసం ప్రాణ త్యాగం చేసిన అల్లూరి సీతారామరాజుని ప్రజలు ఎప్పటికీ మరవకూడదన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ వంశీ కుంజం, తుర్రం వెంకటేశ్వర్లు, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్