విజయవాడ వరద బాధితుల సహాయార్థం విశాఖపట్నంలో గల రైతు బజార్ రైతులు, హోల్‌సేల్ కూరగాయ వర్తకులు పదివేల కేజీల కూరగాయలు, 14 బస్తాల బియ్యాన్ని సోమవారం పంపించారు. జిల్లా కలెక్టర్ హరేంద్ర ప్రసాద్, జిల్లా వ్యవసాయ మార్కెటింగ్ శాఖ అధికారి షేక్ యాసిన్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా రైతు బజార్ రైతులు, హోల్‌సేల్ కూరగాయ వర్తకులను కలెక్టర్ అభినందించారు.