కేజీహెచ్ లో అగ్నిప్రమాదం

2608చూసినవారు
విశాఖ కేజీహెచ్ లో మంగళవారం తెల్లవారుజామున అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. సి ఎస్ ఆర్ బ్లాక్ ని మూడో ఫ్లోర్ లో ఈ అగ్నిప్రమాదం చోటు చేసుకోవడంతో తక్షణం సిబ్బంది స్పందించి రోగులను వేరే వార్డుకు తరలించారు. షార్ట్ సర్క్యూట్ కారణంగా ప్రమాదం సంభవించినట్లు ప్రాథమికంగా తెలుస్తోంది. రోగులు ఎవరికి ఎటువంటి ప్రమాదం జరగకపోవడంతో అధికార యంత్రాంగం ఊపిరి పీల్చుకుంది.

సంబంధిత పోస్ట్