సీనియర్ జర్నలిస్టు, విధివిలాసం మాస పత్రిక సంపాదకులు చింతాప్రభాకర్ సోమవారం మధ్యాహ్నం మృతి చెందారు. విశాఖలో ఆయన అందరికీ సుపరిచితులు, నాలుగు రోజులుగా హృదయ సంబంధ రుగ్మత కారణంగా వైద్యం పొందుతున్నారు. అందరి బంధువుగా కొనసాగిన ప్రభాకరరావు మృతి తీరనిలోటని జర్నలిస్టు సంఘాలు పేర్కొన్నారు. మృతదేహానికి జాతీయ జర్నలిస్టుల సంఘం ప్రతినిధి గంట్ల శ్రీనుబాబు, ఏపీడబ్ల్యజేఎఫ్ జిల్లా అధ్యక్షుడు నారాయణ్ నివాళులర్పించారు.