అచ్యుతాపురం: ధరల పెరుగుదలను నియంత్రించాలి

74చూసినవారు
అచ్యుతాపురం: ధరల పెరుగుదలను నియంత్రించాలి
ధరల పెరుగుదలపై ప్రజా పోరు నిర్వహిస్తున్నట్లు సీపీఎం అనకాపల్లి జిల్లా కార్యదర్శి కె. లోకనాథం తెలిపారు. శనివారం అచ్యుతాపురం మండలం హరిపాలెంలో నిర్వహిస్తున్న సీపీఎం మహాసభ ముగింపు సమావేశంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఓ పక్క విద్యుత్ ఛార్జీలు మరోపక్క నిత్యవసర వస్తువుల ధరలు విపరీతంగా పెరగడంతో సామాన్య మధ్యతరగతి ప్రజలు ఆర్థిక ఇబ్బందులు పడుతున్నట్లు తెలిపారు. సీపీఎం మండల కార్యదర్శి ఆర్. రాము పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్