లెమన్ గ్రాస్ టీని రోజూ తీసుకోవడం వల్ల కడుపునొప్పి అజీర్ణం వంటి సమస్యలన్నీ తగ్గిపోతాయి. ఆహ్లాదకరంగా ఉండే నిమ్మగడ్డి సువాసన ఒత్తిడిని తగ్గిస్తుంది. దీనిలోని యాంటీఇన్ల్ఫమేటరీ మినరల్స్ గుండెపోటు ప్రమాదాన్ని నివారిస్తాయి. ఇందులోని యాంటీ ఆక్సిడెంట్లు చర్మాన్ని ఫ్రీ రాడికల్స్ నుంచి సంరక్షిస్తాయి.