ఖాళీ కడుపుతో వ్యాయమం చేస్తే శరీరం శక్తి కోసం పేరుకున్న కొవ్వును వినియోగించుకుంటుంది. దీనిద్వారా కొలెస్ట్రాల్ కరుగుతుంది. టైప్-2 డయాబెటిస్ ఉన్నవారు ఆహారం తీసుకోకుండా వ్యాయామం చేస్తే రక్తం ఇన్సులిన్ స్థాయిలు పెరిగి షుగర్ అదుపులో ఉంటుంది. ఆకలిని పెంచే గ్రెలిన్ హార్మోన్ ఖాళీ కడుపుతో వ్యాయామం చేస్తే అదుపులో ఉంటుంది. కొంతమంది వారి జీవక్రియ, శక్తి స్థాయిలను బట్టి వ్యాయామానికి ముందు ఏదైనా తినాల్సి ఉంటుంది.