విద్యుత్ ఘాతానికి గురైన ఉపాధి కూలీ

82చూసినవారు
విద్యుత్ ఘాతానికి గురైన ఉపాధి కూలీ
పరవాడ మండలం తానం గ్రామంలో జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో కూలిగా పనిచేస్తున్న చీపురుపల్లి అప్పారావు క్లీన్ ఆంధ్ర గ్రీన్ ఆంధ్రాలో భాగంగా కంసాలి చెరువులో కొబ్బరి మొక్కలకు కంచె కడుతుండగా శుక్రవారం విద్యుత్ ఘాతానికి గురయ్యాడు. అప్పర్ సీలేరు నుండి పెందుర్తి వెళ్లే ఏపీ ట్రాన్స్ కో తీగలు ఉపాధి కూలీ పని చేస్తున్న చెరువులో బాగా కిందకి వాలుగా ఉన్నాయి. భూమికి కేవలం పది అడుగులు ఎత్తులో ఉండడంతో ఈ ప్రమాదం జరిగింది.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్