పాఠశాల యాజమాన్య కమిటీ ఎన్నికలు (SMC) ఈనెల 8వ తేదీన జరిగాయి. ఈ మేరకు కాకినాడ జిల్లా, కరప మండలం, కరపలో ఉన్న మహాత్మ జ్యోతిబాపూలే బిసి రెసిడెన్షియల్ పాఠశాలలో జరిగిన ఈ ఎన్నికల్లో అనకాపల్లి జిల్లా, కోటవురట్ల మండలం, కే. వెంకటాపురం గ్రామానికి చెందిన గొల్లు వెంకటరమణ (నూడిల్స్) యాజమాన్య కమిటీ చైర్మన్ గా ఎన్నికయ్యారు.