భీమిలీలోని కాపులుప్పాడ డంపింగ్ యార్డులో గాంధీ జయంతి సందర్భంగా స్వచ్ఛతా హి సేవ 2024 లో ఉన్నత సేవలు అందించిన వారిని సత్కరించారు. గ్రీన్ క్లైమేట్ టీం ఎన్ జి ఒ వ్యవస్థాపక కార్యదర్శి జె. వి. రత్నంను విశాఖపట్నం జిల్లా కలెక్టర్ హరేంద్ర ప్రసాద్, మేయర్ గొలగాని హరి వెంకట కుమారి, భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావులు బుధవారం సత్కరించారు.