చోడవరంలో రేపు జాబ్ మేళా

53చూసినవారు
చోడవరంలో రేపు జాబ్ మేళా
ఏపీఎస్ఎస్డిసి ద్వారా చోడవరం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో.. ఈనెల 6వ తేదీన మెగా జాబ్ మేళా నిర్వహించనున్నట్టు కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ పి కిరణ్ కుమార్, కోఆర్డినేటర్ వి.అప్పలనాయుడు, ప్లేస్మెంట్ కోఆర్డినేటర్ హెచ్. సుధీర్ గురువారం తెలిపారు. ఈ జాబ్ మేళాలో డిగ్రీ, ఇంటర్, టెన్త్ ఉత్తీర్ణులైన వారు పాల్గొనవచ్చు అన్నారు. ఈ మేళాకి హెటిరో ఫార్మా , ఎయిర్టెల్ పేమెంట్ బ్యాంక్, జిఎల్ గ్రూప్ అసోసియేట్స హాజరవుతున్నాయన్నారు. ఈ అవకాశాన్ని నిరుద్యోగులు వినియోగించుకోవాలని తెలిపారు.

సంబంధిత పోస్ట్