పాఠశాల యాజమాన్య కమిటీ ఎన్నికల నగర మోగింది. ఈ మేరకు చోడవరం మండల విద్యాశాఖాధికారి కె. సింహాచలం గురువారం నోటిఫికేషన్ విడుదల చేశారు. చోడవరం మండలంలో గల 42 ప్రాధమిక పాఠశాలలకు, 5 ప్రాథమికోన్నత పాఠశాలలకు 14 ఉన్నత పాఠశాలలు మొత్తం 61 పాఠశాలలకు పాఠశాల యాజమాన్య కమిటీలకు ఎన్నికలు నిర్వహించనున్నారు. దీని ప్రకారం ఆగష్టు1 న ఎన్నికల జాబితా విడుదల చేశారు. ఆగష్టు 8 న ఎన్నికలు నిర్వహించనున్నారు.