జి. కొత్తూరులో విజయోత్సవ సంబరాలు

68చూసినవారు
నర్సీపట్నం ఎమ్మెల్యేగా అయ్యన్నపాత్రుడు గెలుపొందడంతో గొలుగొండ మండలం. జి. కొత్తూరు గ్రామంలో ఆదివారం విజయోత్సవ సంబరాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అయ్యన్న సతీమణి నర్సీపట్నం మున్సిపల్ కౌన్సిలర్ పద్మావతి ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ముందుగా అమ్మవారిని దర్శించుకున్నారు. అనంతరం ఆమె మాట్లాడుతూ అందరి కృషితో అయ్యన్నపాత్రుడు ఘన విజయం సాధించారని అన్నారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను నెరవేరుస్తామన్నారు.

సంబంధిత పోస్ట్