నర్సీపట్నం మండలంలో 54 పాఠశాలలకు స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ ఎన్నికలు ఆగస్టు1 నుంచి 8వ తేదీ వరకు జరుగుతాయని ఎంఈఓ నాగేంద్ర బుధవారం నర్సీపట్నంలో తెలిపారు. ఎన్నికలకు సంబంధించిన నోటిఫికేషన్ గురువారం విడుదలవుతుందన్నారు. ఓటర్ల జాబితా విడుదల చేసిన అనంతరం ఆగస్టు ఐదో తారీఖున అభ్యంతరాలను స్వీకరిస్తామన్నారు. అనంతరం మేనేజ్మెంట్ చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికలు జరుగుతాయని పేర్కొన్నారు.