ఎస్ రాయవరం మండలం తిమ్మాపురం కస్తూర్బా విద్యాలయంలో విద్యార్థినులకు గురువారం పరిశుభ్రత ఆరోగ్యంపై ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారిణి డాక్టర్ రాజేశ్వరి అవగాహన కల్పించారు. బాలికలు రక్తహీనత రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. సానిటరీ నాప్కిన్స్ ఏ విధంగా ఉపయోగించాలో అవగాహన కల్పించారు. వివిధ రకాల వ్యాధులు అవి రాకుండా తీసుకోవాల్సిన ముందు జాగ్రత్త చర్యలను తెలియజేశారు.