సోమవారం నుంచి ఈ నెల 30 వరకు జరగనున్న పదో తరగతి పరీక్షలకు విద్యార్థులు సన్నద్ధమయ్యారు. కోటఉరట్ల మండలంలోని పలు గ్రామాల నుంచి విద్యార్థులు ఆర్టీసీ కేటాయించిన ప్రత్యేక ఉచిత బస్సుల్లో పరీక్షలకు బయలుదేరారు. కె. వెంకటాపురం, కొడవటిపూడి, తిమ్మాపురం, రాట్నాల పాలెం, కోటఉరట్ల తదితర గ్రామాల విద్యార్థులు పరీక్షలు రాసేందుకు బస్సులో బయలుదేరి వెళ్లారు. విద్యార్థులు తమ హాల్ టికెట్లను చూపించి ఉచిత ప్రయాణం చేయవచ్చని నర్సీపట్నం ఆర్టీసీ డిపో ఎండీ ధీరజ్ వెల్లడించారు.