స్వగృహంలో వరలక్ష్మి పూజను నిర్వహించిన హోం మంత్రి

56చూసినవారు
మండల కేంద్రమైన నక్కపల్లిలో రాష్ట్ర హోం శాఖ మంత్రి వంగలపూడి అనిత స్వగృహంలో శుక్రవారం వరలక్ష్మీ పూజలను ఘనంగా నిర్వహించారు. ఈ పూజ కార్యక్రమానికి హోంమంత్రి నియోజకవర్గంలో నాలుగు మండలాల నుంచి మహిళలను ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అందరూ అష్టైశ్వర్యాలతో ఆనందంగా ఉండాలని శ్రావణ శుక్రవారం పూజలను నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్