ప్రజా సంక్షేమం కోసం కూటమి ప్రభుత్వం పని చేస్తున్నట్లు పెందుర్తి ఎమ్మెల్యే పంచకర్ల రమేశ్ బాబు అన్నారు. మంగళవారం పెందుర్తి మండలం వాలుమెరకలో నిర్వహించిన 'ఇది మంచి ప్రభుత్వం' కార్యక్రమంలో పాల్గొని స్టిక్కర్స్ అతికించారు. ఈ సందర్భంగా నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ నియోజకవర్గంలో ప్రజల సమస్యల పరిష్కారానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నట్లు తెలిపారు. జిల్లా టీడీపీ అధ్యక్షుడు గండి బాజ్జి పాల్గొన్నారు.