సింహాద్రి అప్పన్నకు స్వర్ణ పుష్పార్చన

67చూసినవారు
సింహాద్రి అప్పన్నకు స్వర్ణ పుష్పార్చన
సింహాచలం ఆలయంలో సింహాద్రి అప్పన్నకు గురువారం వైభవంగా స్వర్ణ పుష్పార్చన పూజ నిర్వహించారు. అర్చకులు స్వామిని సుప్రభాత సేవతో మేల్కొల్పి ప్రాతఃకాల పూజలను సంప్రదాయబద్ధంగా నిర్వహించారు. శ్రీదేవి భూదేవి సమేతంగా గోవిందరాజస్వామిని సర్వాంగ సుందరంగా అలంకరించి ఆలయ కళ్యాణ మండపం వేదికపై అధిష్టింప చేశారు. వేదమంత్రాలు నాదస్వర వాయిద్యాల మధ్య స్వామి వారికి 108 బంగారు సంపెంగలతో పూజ జరిపించారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్