ఆంధ్రప్రదేశ్ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల వారి ఆద్వర్యంలో నడపబడుచున్న డా. బీఆర్ అంబేద్కర్ గురుకుల పాఠశాల/కళాశాలల్లో 2024-25 విద్యాసంవత్సరమునకు గాను విశాఖపట్నం జిల్లా పరిధిలో గల 3 గురుకులాల్లో మరియు అనకాపల్లి జిల్లా పరిధిలో గల 8 గురుకులాల్లో 5వ తరగతి లో మరియు ఇంటర్మీడియట్ ప్రధమ సంవత్సరం లో మిగుల సీట్ల భర్తీ కొరకు ఈ నెల 24వ తేదిన స్పాట్ అడ్మిషన్ కౌన్సిలింగ్ నిర్వహిస్తున్నట్లు ఈ రెండు జిల్లాల గురుకులాల సమన్వయకర్త యస్. రూపవతి మంగళవారం తెలిపారు.
ఐదో తరగతిలో ప్రవేశం కోరకు విద్యార్థిని, విద్యార్థులు 4వ తరగతి చదివిన స్టడీ సర్టిఫికెట్, ఆధార్, కుల, ఆదాయ దృవీకరణ పత్రములు మరియు ఇంటర్మీడియట్ ప్రధమ సంవత్సరంలో ప్రవేశం కోరకు విద్యార్థిని, విద్యార్థులు ఆధార్, కుల, ఆదాయ దృవీకరణ పత్రముల తో పాటు 10వ తరగతి మార్క్స్ లిస్టు తీసుకొని ఈ నెల 24వ తేదిన ఉదయం 10 గంటల నుంచి అడ్మిషన్ కౌన్సిలింగ్ నకు డా. బీఆర్ అంబేద్కర్ గురుకుల పాఠశాల/కళాశాల మేఘాద్రిగెడ్డ, (ఆంధ్ర సిమెంట్ ఫాక్టరీ దగ్గరలో) విశాఖపట్నం నందు హాజరు కావలెను. 10వ తరగతి లో సాధించిన మార్క్స్ ఆధారంగా, రూల్ ఆఫ్ రిజర్వేషన్ కు అనుగుణంగా సీట్లు భర్తీ చేయబడతాయని తెలియచేయడమైనది.
మరింత సమాచారం కొరకు 7658945570 & 8790356309 నెంబర్ కు సంప్రదించాలన్నారు.