అనకాపల్లి జిల్లా గుల్లిపాడు, తుని రైల్వే స్టేషన్ల మధ్య రైలు నుండి జారిపడింది గుర్తు తెలియని వృద్ధురాలు. దీంతో బలమైన గాయాలు కాగా వెంటనే 108 అంబులెన్స్ ద్వారా తుని గవర్నమెంట్ ఏరియా హాస్పిటల్ కు తరలించారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం కాకినాడ గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ కి తరలించగా.. అక్కడ వైద్యం పొందుతూ గురువారం మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. ఆచూకీ తెలిసిన వారు ఎవరైనా ఉంటే తుని రైల్వే పోలీసు వారిని సంప్రదించాలన్నారు.