సీపీఎం ఆధ్వర్యంలో అచ్యుతాపురంలో గురువారం విజయవాడ వరద బాధితులు కోసం నిధుల సేకరణ చేపట్టారు. ఈ సందర్భంగా సీపీఎం మండల కార్యదర్శి రాము మాట్లాడుతూ.. విజయవాడ, ఎన్టీఆర్, బాపట్ల, కృష్ణలో వరద ముంపు ప్రాంతాల పరిస్థితి చాలా దయనీయంగా ఉందని అన్నారు. ప్రభుత్వం, సంస్థలు ఎంతగా సహాయం చేసినా, ఇంకా సహాయం అందించాల్సిన అవసరం ఉందని చెప్పారు. ప్రతి ఒక్కరూ మానవతా ధృక్పథంతో స్పందించి సహాయ నిధికి అండగా నిలవాలన్నారు.