మునగపాక మండలం వాడ్రాపల్లిలో మట్టి వినాయక విగ్రహాలతో పాటు వ్రతకల్పం పుస్తకాలను జనసేన ఉత్తరాంధ్ర రీజినల్ కోఆర్డినేటర్ సుందర్ సతీష్ కుమార్ గురువారం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పర్యావరణహితంగా వినాయక చవితి పండుగను జరుపుకోవాలన్నారు. ప్లాస్టర్ ఆఫ్ ది పారిస్ తో తయారుచేసిన విగ్రహాల వల్ల పర్యావరణానికి హాని కలుగుతుందన్నారు. ఈ విషయాన్ని అందరూ గమనించాలన్నారు.