శిక్షా సప్తాహ్ కార్యక్రమంలో భాగంగా శుక్రవారం కె. వెంకటాపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో సాంకేతిక పరిజ్ఞాన దినోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా తెలుగు ఉపాధ్యాయురాలు క్రాంతి కిరణ్ విద్యార్థులకు సాంకేతిక పరిజ్ఞానం వాడకంపై అవగాహన కల్పించారు. హెచ్ఎం షేక్ అల్లావుద్దీన్ మాట్లాడుతూ. మొబైల్ ఫోన్ ఇతర పరికరాలను చదువు నిమిత్తం వినియోగించుకోవాలని సూచించారు. అవసరానికి మించి వాడితే అనర్ధాలు కలుగుతాయని తెలిపారు.