గుత్తి మున్సిపాలిటీ కార్యాలయాన్ని తనిఖీ చేసిన కలెక్టర్

54చూసినవారు
అనంతపురం జిల్లా గుత్తి మున్సిపాలిటీ కార్యాలయాన్ని అనంతపురం కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ గురువారం సాయంత్రం ఆకస్మిక తనిఖీ చేశారు. కార్యాలయంలో పలువురు అధికారులతో సమావేశం నిర్వహించారు. మున్సిపాలిటీ అధికారుల పనితీరు ఎలా ఉందని కమిషనర్ జబ్బర్ మియాను అడిగి తెలుసుకున్నారు. అనంతరం పలు రికార్డులను పరిశీలించి మాట్లాడారు. ప్రజలకు మెరుగైన సేవలు అందించాలన్నారు.

సంబంధిత పోస్ట్