కామ్రేడ్ సీతారాం ఏచూరి సంతాప సభలో అన్ని పార్టీల నాయకులు పాల్గొన్నారు. శుక్రవారం అనంతపురం పట్టణంలోని లలిత కళాపరిషత్లో నిర్వహించిన సంతాప సభలో రాయదుర్గం ఎమ్మెల్యే కాలువ శ్రీనివాసులు, అనంతపురం, ఉరవకొండ, శింగనమల మాజీ ఎమ్మెల్యేలు అనంత వెంకట్రామిరెడ్డి, విశ్వేశ్వర్ రెడ్డి, శైలజనాథ్ లతోపాటు సీపీఐ నాయకులు పాల్గొన్నారు. ఆయన చిత్రపటానికి నివాళి అర్పించి, ఏచూరి సేవలను కొనియాడారు.