పీర్ల స్వామి అగ్నిగుండం తవ్వుతుండగా కనిపించిన నిప్పులు

64చూసినవారు
కళ్యాణదుర్గం మండలం గోళ్ల గ్రామంలో మంగళవారం రాత్రి అగ్నిగుండం తవ్వుతుండగా అగ్గి నిప్పులు కనిపించాయని స్థానికులు తెలిపారు. వారు మాట్లాడుతూ చిన్న పీర్ల పండుగ ఉత్సవాలలో భాగంగా అగ్నిగుండం తవ్వుతుండగా గత ఏడాది ఏర్పాటు చేసిన అగ్నిగుండంలో అగ్గి నిప్పులు కనిపించడం ఆశ్చర్యంగా ఉందని తెలిపారు. దీనిని చూడడానికి చుట్టుపక్కల గ్రామాల నుంచి కూడా స్వామి భక్తుల తరలివచ్చి నిప్పులను చూసి ఆశ్చర్యపోయారు.

సంబంధిత పోస్ట్