కళ్యాణదుర్గం మండలం శీబావి గ్రామంలో నీటి సమస్యతో గ్రామస్థులు చాలా ఇబ్బందులు పడ్డారు. ఈ విషయం కళ్యాణదుర్గం ఎమ్మెల్యే అమిలినేని సురేంద్ర బాబుకు గ్రామస్తులు తెలిపారు. వెంటనే స్పందించిన ఎమ్మెల్యే శనివారం గోళ్ల సర్పంచ్ కవిత బొజ్జన్నతో గ్రామంలో బోరు వేయించారు. నీరు పుష్కలంగా పడ్డాయి. నీటి సమస్యను పరిష్కరించిన కళ్యాణదుర్గం ఎమ్మెల్యేకు గ్రామస్థులు ధన్యవాదాలు తెలిపారు.