రాప్తాడు: విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటితో ఎమ్మెల్యే భేటీ
రాప్తాడు నియోజకవర్గంలోని రైతులకు మెరుగైన విద్యుత్ అందించేందుకు అవసరమైన సహకారం అందించాలని విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ ను రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీతమ్మ బుధవారం కోరారు. విజయవాడలోని మంత్రి గొట్టిపాటి రవి నివాసంలో ఎమ్మెల్యే సునీతమ్మ విద్యుత్ సబ్ స్టేషన్లు, ట్రాన్స్ఫార్మర్ లు, మెటీరియల్ మంజూరు చేయాల్సిందిగా మంత్రి రవికి వినతిపత్రం అందజేశారు. ధర్మవరం ఇన్ చార్జ్ శ్రీరామ్ పాల్గొన్నారు.