రాయదుర్గంలో ఐదు మంది గుప్త నిధుల వేటగాళ్లు అరెస్ట్

51చూసినవారు
రాయదుర్గం నియోజకవర్గంలో గుప్త నిధుల వేటగాళ్ల గుట్టును పోలీసులు రట్టు చేశారు. పురాతన ఆలయాలే లక్ష్యంగా గుప్త నిధుల తవ్వకాలు చేపడుతున్న ఐదు మందిని అరెస్టు చేసినట్లు డీఎస్పీ రవిబాబు తెలిపారు. కుంటి మారమ్మ ఆలయం సమీపంలో అనుమానితులుగా ఉన్న వారిని అదుపులోకి తీసుకోని విచారించగా విషయం బయటపడిందన్నారు. వారి వద్ద మరణాయుధాలు, పూజా సామగ్రి ఉన్నట్లు గుర్తించామన్నారు. మరో ముగ్గురు ముద్దాయిలు పరారిలో ఉన్నారన్నారు.

సంబంధిత పోస్ట్