తాడిపత్రి లో గేదెల దొంగలు అరెస్టు

66చూసినవారు
తాడిపత్రి లో గేదెల దొంగలు అరెస్టు
తాడిపత్రి మండలంలో పశువుల చోరీకి పాల్పడుతున్న ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేశారు. మండల పరిధిలోని గన్నెవారిపల్లి కాలనీకి చెందిన పరమేశ్, మనోహర్ తమ మూడు గేదెలను గుర్తుతెలియని వ్యక్తులు దొంగలించారంటూ శుక్రవారం ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టిన సీఐ శివగంగాధర్ రెడ్డి వంగనూరుకు చెందిన బాబు, మారుతిని అదుపులోకి తీసుకుని రిమాండ్ కు తరలించినట్లు తెలిపారు.

సంబంధిత పోస్ట్