ఎస్పీని కలిసిన ఎమ్మెల్యే అస్మిత్ రెడ్డి

54చూసినవారు
ఇసుక మాఫియాకు అడ్డుకట్ట వేయాలని కోరుతూ ఎమ్మెల్యే అస్మిత్ రెడ్డి బుధవారం అనంతపురం జిల్లా ఎస్పీ జగదీశ్‌ను కోరారు. ఎస్పీని కలిసిన తర్వాత ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఇసుక అక్రమ రవాణాను అరికట్టాలని ఎస్పీని కోరమన్నారు. కొంతమంది పోలీసుల తీరులో ఇంకా మార్పు రాలేదు అని, ఒకరిద్దరి పోలీసుల వల్ల మొత్తం జిల్లా పోలీసు వ్యవస్థకు చెడ్డ పేరు వస్తోంది అన్నారు. తాడిపత్రి ఇసుక మాఫియా గురించి ఎన్జీటీకి కూడా ఫిర్యాదు చేశామన్నారు. ఇసుక అక్రమ రవాణా గురించి ఒక ప్రత్యేక టీం నీ ఏర్పాటు చేయమని ఎస్పిని అడిగినట్లు పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్