పెద్దపప్పూరు మండల పరిధిలోని అశ్వర్థ నారాయణ స్వామికి ఆదివారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ ప్రధాన అర్చకులు అర్చనలు, అభిషేకాలు, కాగడ హారతి వంటి ప్రత్యేక పూజలు నిర్వహించారు. పెద్దపప్పూరు మండలం నుంచే కాకుండా జిల్లా నలమూలల నుంచి భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. ఆలయ కమిటీ సభ్యులు, అర్చకులు భక్తులకు తీర్థ ప్రసాదాలను పంపిణీ చేశారు.