తాడిపత్రి నియోజకవర్గంలో ఎక్కువశాతం ప్రజలు వ్యవసాయంపైనే ఆధారపడ్డారని, చివరి ఆయకట్టు వరకు సాగునీరందించాలని తెదేపా నాయకులు పేర్కొన్నారు. ఆదివారం జిల్లాకు వచ్చిన నీటిపారుదలశాఖామంత్రి నిమ్మల రామానాయుడిని పెద్దవడుగూరు మండలంలోని కాసేపల్లి వద్ద కలిసి వినతిపత్రం అందజేశారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ నియోజకవర్గంలో ఉన్న చాగల్లు, పెండేకల్లు, ముచ్చుకోట రిజర్వాయర్లకు, యాడికి, తాడిపత్రి బ్రాంచ్ కెనాల్ కు నీరివ్వాలని కోరారు.