ఉచిత ఇసుక విధానం పేదలకు వరం : కన్వీనర్ చంద్రశేఖర్

50చూసినవారు
ఉచిత ఇసుక విధానం పేదలకు వరం : కన్వీనర్ చంద్రశేఖర్
జనసేన పార్టీ షణ్ముఖ వ్యూహంలో భాగంగా ఉచిత ఇసుక ఇస్తామన్న పవన్ కళ్యాణ్ హామీపై కూటమి ప్రభుత్వం మాట నిలబెట్టుకుందని జనసేన పార్టీ ఉరవకొండ మండల కన్వీనర్ చంద్రశేఖర్ తెలిపారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఉచిత ఇసుక విధానంతో గత ప్రభుత్వంలో ఇసుక విధానం వల్ల ఉపాధి కోల్పోయిన లక్షలాది భవన నిర్మాణ కార్మికులు, సొంత ఇల్లు కట్టుకోవాలనుకునే పేదలకు కష్టాలు తప్పినట్టేనని సంతోషం వ్యక్తం చేశారు.

సంబంధిత పోస్ట్