ఉమ్మడి అనంత జిల్లాలో కేంద్ర ప్రభుత్వ
సాకారంతో ఇంటింటికి కొళాయి ద్వారా సురక్షితమైన మంచినీరు అందించడమే జలజీవన్ మిషన్ పథకం లక్ష్యమని ఐఈసి కోఆర్డినేటర్ పి. ధనుంజయ సెంట్రల్ టీం ప్రతినిధి నవీన్ తెలిపారు. బుధవారం మండల పరిధిలోని షేక్షాన్నిపల్లి పంచాయతీ కోనాపురంలో జల్జీవన్ మిషన్ కేంద్ర బృందం ప్రతినిధులు సురక్షిత నీటి నాణ్యతను పరిశీలించారు. సేకరించిన నీటిలో క్లోరీన్, ఫ్లోరైడ్ తదితర అంశాలను పరిశీలించారు.