వజ్రకరూరు మండల నూతన తహశీల్దార్ గా నయాజ్ అహ్మద్ సోమవారం నూతన బాధ్యతలు స్వీకరించారు. ముందుగా కార్యాలయ సిబ్బంది పుష్పగుచ్ఛం అందజేసి స్వాగతం పలికారు. తహశీల్దార్ మాట్లాడుతూ. మండల ప్రజా సంఘాల నాయకులు, స్వచ్ఛంద కార్యకర్తలు మండల ప్రజలు సహకరించాలన్నారు. మండల అభివృద్ధికి కృషి చేస్తానన్నారు.