కోతులు పోవాలంటే పులివేషం వేయాల్సిందే..

1050చూసినవారు
ఉరవకొండ మండలంలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం పెన్నహోబిలం శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో కోతుల బెడద ఎక్కువగా ఉంది. ఆలయానికి వచ్చిన భక్తులపై కోతుల అనేకసార్లు దాడులు చేసిన ఘటనలు కూడా ఉన్నాయి. అయితే వాటిని నివారించేందుకు ఆలయ అధికారులు ఓ వినూత్న ఆలోచనా చేసి పులివేషం వేసుకున్న ఓ వ్యక్తిని నియమించారు. కోతులు ఎక్కువ ఉన్న చోట ఆ వ్యక్తి వెళ్తే నిజంగానే పులి వచ్చిందనుకొని అవి అక్కడి నుండి వెళ్లిపోతాయి.

సంబంధిత పోస్ట్