ఉరవకొండ రైల్వేలైన్ కోసం కృషి చేస్తా : అనంత ఎంపీ అంబికా

560చూసినవారు
ఉరవకొండ రైల్వేలైన్ కోసం కృషి చేస్తా : అనంత ఎంపీ అంబికా
అనంతపురం రాయదుర్గం రైల్వే స్టేషన్ల మధ్య ఉరవకొండ ప్రాంతాన్ని అనుసంధానం చేస్తూ నూతన రైల్వే లైన్ కోసం కృషి చేస్తానని అనంతపురం ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ తెలిపారు. గురువారం సాయంత్రం జనసేన పార్టీ ఉరవకొండ మండల కన్వీనర్ చంద్రశేఖర్ ఎంపీ స్వగృహంలో ఆయనతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా చంద్రశేఖర్ మాట్లాడుతూ ఉరవకొండ ప్రత్యేక రైల్వే లైన్ కోసం గతంలో గుంతకల్లు నుంచి ఉరవకొండ మీదుగా కళ్యాణదుర్గం తుమకూరు వరకూ కొత్త రైల్వే లైన్ వేయాలనే ప్రతిపాదనని ఎంపీకి గుర్తు చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్