గార్లదిన్నె మండలం తలగసిపల్లి వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన వ్యవసాయ కూలీల కుటుంబాలకు ప్రభుత్వం అన్ని విధాల అండగా ఉంటుందని బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత శనివారం పేర్కొన్నారు. ప్రమాద విషయం తెలుసుకున్న ఆమె వెంటనే అనంతపురం ఆసుపత్రికి వెళ్లి మృతదేహాలకు నివాళులర్పించారు. గాయపడిన వారిని పరామర్శించి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. మెరుగైన వైద్యం అందించాలని వైద్యులను సూచించారు.