అనంతపురంలో శ్రీనగర్ కాలనీలోని అయ్యప్ప స్వామి ఆలయం పక్కన ఈనెల 22న సినీ నటుడు నందమూరి బాలకృష్ణ నటించిన డాకు మహారాజ్ విజయోత్సవ సభ నిర్వహిస్తున్నట్లు ఎన్. బి. కే అభిమాన సంఘం నాయకులు ఆదివారం తెలిపారు. ఎమ్మెల్యే దగ్గుబాటి ప్రసాద్, అభిమాన సంఘం రాష్ట్ర అధ్యక్షుడు గౌస్ మొహిద్దిన్ స్థల ప్రాంగణాన్ని ఆదివారం పరిశీలించారు. దాదాపు 25 వేల మందితో విజయోత్సవ సభను నిర్వహిస్తున్నట్లు తెలిపారు.