అనంతపురం: రోడ్డు విస్తరణపై నష్టపరిహారం కోరిన షాపుల యజమానులు

50చూసినవారు
అనంతపురం: రోడ్డు విస్తరణపై నష్టపరిహారం కోరిన షాపుల యజమానులు
అనంతపురం సప్తగిరి సర్కిల్ వద్ద ఈద్గా మస్జిద్ కాంప్లెక్స్‌లో ఉన్న 40 షాపుల యజమానులు రెవెన్యూ అధికారి విజయలక్ష్మికి బుధవారం వినతి పత్రం అందజేశారు. వారు రోడ్డు విస్తరణ కారణంగా తమ షాపులు తొలగించకూడదని, లేదా ఒక్కొక్క షాపుకు రూ. 20 లక్షల నష్టపరిహారం చెల్లించాలని కోరారు. గతంలో తెలుగుదేశం ప్రభుత్వం అండగా నిలిచినట్లు గుర్తుచేస్తూ, ప్రస్తుత ప్రభుత్వం కూడా తమకు న్యాయం చేయాలని కోరారు.

సంబంధిత పోస్ట్