అనంతపురం: లింగ నిర్ధారణ చేస్తే కఠిన చర్యలు తప్పవు

53చూసినవారు
అనంతపురం: లింగ నిర్ధారణ చేస్తే కఠిన చర్యలు తప్పవు
అనంతపురం రెవెన్యూ డివిజనల్ అధికారి వసంత బాబు అధ్యక్షతన ఆర్డీవో కార్యాలయంలో బుధవారం గర్భస్థ పిండా లింగ నిర్ధారణ నిషేధిత చట్టంపై డివిజనల్ స్థాయి కమిటీ సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా ఆర్డీవో వసంత బాబు మాట్లాడుతూ గర్భస్థ పిండ లింగ నిర్ధారణ నిషేధిత చట్టం 1994 పైన గ్రామస్థాయి ఆర్గనైజేషన్స్ మరియు గ్రామస్థాయి సమైక్య గ్రూపుల నందు క్షేత్రస్థాయిలోని అంగన్వాడి కార్యకర్తలు అవగాహన కల్పించాలని ఆదేశించారు.

సంబంధిత పోస్ట్