వరద బాధితులకు రూ. 3 లక్షల విరాళం

62చూసినవారు
వరద బాధితులకు రూ. 3 లక్షల విరాళం
విజయవాడ వరద బాధితులకు అండగా నిలిచేందుకు అనంతపురం నగరానికి చెందిన ప్రముఖ వ్యాపారులు, ఇతర వర్గాల వారు పెద్ద ఎత్తున ముందుకు వస్తున్నారు. ఎమ్మెల్యే దగ్గుపాటి పిలుపు మేరకు విరాళాలు ప్రకటిస్తున్నారు. బుధవారం అనంతపురం నగరానికి చెందిన ప్రముఖ రాజహంస బిల్డర్స్ అధినేతలు శ్రీనివాస్, శేఖర్, సాగర్లు వరద బాధితుల కోసం రూ. 3 లక్షలను విరాళంగా ప్రకటించారు. ఆ మొత్తాన్ని ఎమ్మెల్యేకు అందజేయగా వారిని అభినందించారు.

సంబంధిత పోస్ట్