విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ ఆపకపోతే పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తాం

70చూసినవారు
విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ ఆపకపోతే పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తాం
విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణ నిలుపుదల చేయాలని శనివారం అనంతపురం నగరంలోని జనవిజ్ఞాన వేదిక కార్యాలయంలో ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షుడు రాజేష్ గౌడ్ అధ్యక్షతన రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి రాజారెడ్డి మాట్లాడుతూ.. విశాఖ ఉక్కు పరిశ్రమను ప్రైవేటీకరణ నిలుపుదల చేయకపోతే భవిష్యత్తులో పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తామని పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్