‘దంగల్‌’ మేకర్స్‌పై బబితా ఫొగాట్‌ ఆరోపణలు

65చూసినవారు
‘దంగల్‌’ మేకర్స్‌పై బబితా ఫొగాట్‌ ఆరోపణలు
రెజ్లర్స్ గీతా ఫొగాట్, బబితా ఫొగాట్ జీవితాన్ని ఆధారంగా చేసుకుని తెరకెక్కించిన మూవీ ‘దంగల్’. తాజాగా ఈ చిత్ర బృందంపై బబితా ఫొగాట్ కీలక ఆరోపణలు చేశారు. ఈ మూవీ బాక్సాఫీస్ దగ్గర రూ.2 వేల కోట్లు వసూలు చేసిందని, తమకు మాత్రం రూ. కోటి కూడా ఇవ్వలేదని మండిపడ్డారు. తమ గ్రామంలో అకాడమీ నిర్మించడానికి సాయం చేస్తామని హామీ ఇచ్చారని, కానీ.. దాన్ని నిలబెట్టుకోలేదని విమర్శించారు.

సంబంధిత పోస్ట్