అనంతపురం మునిసిపల్ కమిషనర్ నాగరాజును తెలుగు మహిళ రాష్ట్ర కార్యదర్శి డీ. హసీనా బేగం, తెలుగుదేశం పార్టీ 18వ డివిజన్ ఇంచార్జి, యూనిట్ ఇంచార్జి ఎస్. ఖలందర్, బూత్ కన్వీనర్లు అబ్దుల్ హీదాయత్, మున్ని మంగళవారం కలిశారు. 18వ డివిజన్ లో డ్రైనేజీ సమస్య, పందుల సమస్య, వీధి లైట్స్, ఇతర సమస్యల గురించి ఆయనకు వినతిపత్రం ఇచ్చారు. సమస్యలను వీలైనంత తొందరలో పరిష్కరిస్తామని ఆయన హామీ ఇచ్చారు.